రాహుల్, రఫేల్ కేసులు కొట్టివేసిన సుప్రీం కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్, రఫేల్ కేసులు కొట్టివేసిన సుప్రీం కోర్టు

November 14, 2019

సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక కేసులపై తీర్పును వెల్లడించింది. శబరిమల, రాహుల గాంధీపై దాఖలైన పరువు నష్టం దావా కేసు, రఫేల్ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించింది. దీంట్లో రాహుల్, రఫేల్‌పై దాఖలైన కేసులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిర్ణయంతో రాహుల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. 

రాహుల్‌పై దాఖలైన పరువు నష్టం దావా కేసుపై తీర్పు వెల్లడిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో సంయమనం పాటించాలని సూచించింది. మాట తూలకుండా చూసుకోవాలంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడే దొంగ) అంటూ వ్యాఖ్యానించారు.

Supreme Court Relief.

కేంద్ర ప్రభుత్వానికి ఊరట : 

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై కూడా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసులో మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. గతంలో రఫేల్ ఒప్పందం సరైనదేనని 2018 డిసెంబర్ 14న సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. దీనిపై మరోసారి సమీక్షించాలంటూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. దీనిపై సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసులో ఊరట లభించింది.