సస్పెన్స్ థ్రిల్లర్‌‌లా మహారాష్ట్ర పంచాయితీ.. సుప్రీం తీర్పు రేపటికి వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

సస్పెన్స్ థ్రిల్లర్‌‌లా మహారాష్ట్ర పంచాయితీ.. సుప్రీం తీర్పు రేపటికి వాయిదా

November 25, 2019

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయితీ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిపోతోంది. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం రాజ్యాంగ విరుద్ధమంటూ బలపరీక్ష చేసుకోవాలని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.దీనిపై మరోసారి సోమవారం ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. ఈ సందర్భంగా బీజేపీ తరుపు లాయర్ ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని అందజేశారు. తమకు వారి మద్దతు ఉందని ఆయన కోర్టుకు విన్నవించాడు. 

Supeme Crourt..

బీజేపీ వాదనను ఎన్సీపీ తరుపు లాయర్ అభిషేక్ సింఘ్వి ఖండించారు. లేఖలో సంతకాలు ఉన్నాయి తప్ప వారు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా లేదన్నారు. వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. ఇరు పక్షాల వాదానలు విన్న సుప్రీం కోర్టు.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనుంది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వర్గాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని ప్రశ్నించారు. తీర్పును రిజర్వులో పెట్టడంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.