Home > Featured > నుపుర్ శర్మపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఇంత అహంకారమా?

నుపుర్ శర్మపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఇంత అహంకారమా?

ఇస్లాం మత వ్యవస్థాపకులు మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని కోరింది. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టాయని ఆగ్రహించింది. కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని, వాటన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అధికార పార్టీకి ఒక అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీలాంటి వారికి మతాల పట్ల గౌరవం ఉండదు. చీప్ పబ్లిసిటీ, పొలిటికల్ ఎజెండాతో ఇలాంటి ప్రకటనలు చేశారు. దీని వల్లే ఉదయ్ పూర్ ఘటన జరిగింది. ఆ అవసరం ఏమొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనం. టీవీ ద్వారా నుపుర్ శర్మ జాతికి క్షమాపణలు చెప్పాలి. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన ఛానెల్‌పై కూడా కేసు పెట్టాల్సింది’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.

Updated : 1 July 2022 1:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top