వాకపల్లి రేప్ కేసుపై సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

వాకపల్లి రేప్ కేసుపై సీరియస్

September 2, 2017

విశాఖపట్నం జిల్లా వాకపల్లి గిరిజన మహిళలపై పదేళ్ల కిందట జరిగిన పోలీసుల అత్యాచారం కేసులో జాప్యంపై శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  పదేళ్లయినా ఇంతరవకు విచారణే మొదలుకాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని మండిపడిందది. ‘గిరిజన మహిళలకు న్యాయం దక్కడం లేదు. మరీ ఇంత అన్యాయమా? ఇకనైనా విచారణను వేగతవంతం  చేయండి. రోజువారీ విచారణతో తర్వగా తేల్చండి’ అని ఏపీ ప్రభుత్వాన్ని, సంబంధిత కోర్టును ఆదేశించింది. తమపై కేసు కొట్టాయాలని నిందితులైన 13 మంది పోలీసులు చేసుకున్న దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2007 ఆగస్టు 20తేదీ రాత్రి వాకపల్లిలో దారుణం జరిగింది. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో గ్రామంలోకి చొరబడిన పోలీసులు ఇంటింటినీ సోదా చేశారు. ఇళ్లలో మగవాళ్లు లేరని చెప్పినా వినలేదు. కనిపించిన ఆడవాళ్లపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. 22 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 37 (2), సెక్షన్‌ 3 (2), ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారం చట్టం కింద కేసులు నమోదయ్యాయి.