ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతి కోటా అక్కర్లేదు.. సుప్రీం - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతి కోటా అక్కర్లేదు.. సుప్రీం

September 26, 2018

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  ఎస్సీ, ఎస్టీలు పదోన్నతులు పొందేందుకు రిజర్వేషన్ కల్పించడంపై గతంలో ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు జడ్డీల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.

tt

 ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని 2006లలో నాగరాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన  కోర్టు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి కాదంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసులో సమీక్షలు చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ప్రమోషన్లకు రిజర్వేషన్లు అవసరం లేదని ఇచ్చిన తీర్పును సమర్ధించింది. 2006 తీర్పు పునఃపరిశీలన కోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీం తోసిపుచ్చింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం రాష్ట్రాలు ఎటువంటి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

తీర్పుపై నిరసన

సుప్రీం కోర్టు తీర్పుపై దళిత సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఉన్నత స్థానాల్లో నేటికీ అగ్రవర్ణాల వారే ఉన్నారని, తమకు పదోన్నతుల్లో కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖరగ్ పూర్ ఐఐటీలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎస్టీ, ఎస్సీల సంఖ్య నామమాత్రంగా ఉందని, దేశంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులను విశ్లేషించి అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.

tt