హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమించిన సుప్రీం కోర్టు ఇకపై అన్ని వ్యవహారాలు అదే చూసుకుంటుందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయన సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది.
‘‘పారదర్శక ఎన్నికలతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది’’ అని తేల్చిచెప్పింది. తన అంబుడ్స్‌మెన్‌గా సుప్రీం మాజీ జడ్డి దీపక్ వర్మను కమిటీ నియమించుకున్న కేసుపై సుప్రీం విచారణ జరపుతోంది. వర్మ నియమాకం చెల్లదని కొన్ని క్రికెట్ సంఘాలు సుప్రీంను ఆశ్రయించాయి. కేసులు పెండింగులో ఉన్నా అజరుద్దీన్ ఇంకా కమిటీ పనులు చేస్తున్నారని ఓ పిటిషనర్ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు కమిటీని వేసింది. కమిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, కొందరిపై వివక్ష చూపుతున్నారని చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి.