వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. వివేకా హత్యకేసును సుప్రీంకోర్టే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినందున.. గంగిరెడ్డికి బెయిల్ రద్దుచేసే విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసుల చేతులో విచారణ ఉన్నప్పుడు బెయిల్ వచ్చిందని సుప్రీంకోర్టులో.. సీబీఐ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టుకు బెయిల్ పిటిషన్‌ను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. త్వరలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.