ఆధార్ దేనికి ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు? సుప్రీం తీర్పుతో స్పష్టత - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ దేనికి ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు? సుప్రీం తీర్పుతో స్పష్టత

September 26, 2018

ఆధార్ వివాదం కొలిక్కి వచ్చింది. అది రాజ్యాంగ బద్ధమేనని అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు విచారించి ఈ రోజు తీర్పు వెలువరించింది. జాతీయ గుర్తింపు కార్డు అయిన ఆధార్ సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీల్లేదని కోర్టు  ఆదేశించింది. ఆధార్ దుర్వినియోగం కాకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలని సర్కారుకు సూచించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. Supreme court Verdict Aadhar Is Not Mandatory For Bank Account, Mobile Connectionపాన్ కార్డ్ వంటి కీలకమైన ఆదాయ పత్రాలకు ఆధార్ అవసరమని, స్కూల్ అడ్మిషన్లు వంటి వాటికి అక్కర్లేదని పేర్కొంది. ఆధార్ ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలు బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. ‘పేదల సాధికారతలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. వారికి ఒక గుర్తింపు లభిస్తోంది. దీనికి నకిలీలు తయారు చేయడం కష్టం. ఆధార్ డేటాకు భద్రత కూడా ఉంది. ఆధార్ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం లేదు. ఆధార్ కార్డు కోసం ప్రభుత్వం కేవలం కొన్ని ప్రాథమిక ఆధారాలను మాత్రమే సేకరిస్తుంది..’ అని కోర్టు వ్యాఖ్యనించింది.  

వీటికి తప్పనిసరి

* పాన్ కార్డు పొందడానికి * ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి * ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు

వీటికి అక్కర్లేదు

* బ్యాంకు ఖాతాలకు * టెలికాం సేవలు, మొబైల్ నంబరుతో లింకింగ్ * సీబీఎస్, నీట్, యూజీసీ వంటి పరీక్షలకు

* స్కూల్ అడ్మిషన్లకు