అయోధ్య తీర్పు.. పట్టా ఉన్నోళ్లకే హక్కు: సుప్రీం  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పు.. పట్టా ఉన్నోళ్లకే హక్కు: సుప్రీం 

November 9, 2019

70 ఏళ్లుగా నానుతున్న అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరిస్తోంది. తాము మత విశ్వాసాల ఆధారంగా ఆ భూమి ఎవరిదో చెప్పలేమని, భూమి హక్కుకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఎవరి వద్ద ఉంటే వారిదే ఆ భూమి అని తేల్చిచెప్పింది. ముస్లింలకు అక్కడ నమాజు చేసుకునే హక్కు ఉందని పేర్కొంది. 

‘బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో జరగలేదు. అంతకు ముందు అక్కడ అక్కడ ఆలయం ఉందో, మసీదు ఉందో మేం చెప్పలేం. కానీ మసీదు మాత్రం బాబర్ కాలంలోనే మసీదు జరిగింది. రాముడు అయోధ్యలో పుట్టాడన్న మత విశ్వాసాలతో మాకు సంబంధం లేదు.. మసీదు నిర్మాణానికి ముందు అక్కడ హిందూ ఆలయం ఉన్నా దానిపై ఈ రోజు హక్కును ప్రకటించుకోవడం సాధ్యం కాదు.. వివాదాస్పద స్థలంపై హక్కులు ఎవరివో తేల్చాల్సింది రికార్డులే’ అని పేర్కొంది..

Supreme court ..

1949లో మసీదు మధ్య గుమ్మటం కింద విగ్రహాలు పెట్టడాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్ సవాలు చేసిందని, ఆ పిటిషన్ విచారణార్హమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ఆ భూమి తమదేనని సున్నీ బోర్డు నిరూపించలేకపోయిందని తెలిపింది. నిర్మోహి అఖాడాకు కా ఆ స్థలంపై హక్కులేదని స్పష్టం చేసింది. ‘1857కు ముందు కూడా బయటి ప్రాంగణంలోన హిందువులు ప్రార్థనలు చేసుకునేవారు. ముస్లింలు కూడా నమాజ్ చేసేవారు. కనుక అది వదిలేసిన మసీదు కాదు. మసీదు ప్రాంతంపై హక్కు ఎవరికి ఉందో కోర్టు కాసేపట్లో ప్రకటించనుంది.