మహా తీర్పు..రేపే ఫడ్నవీస్ బలపరీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

మహా తీర్పు..రేపే ఫడ్నవీస్ బలపరీక్ష

November 26, 2019

మహారాష్ట్ర రాజకీయం సుప్రీం కోర్టు నుంచి తిరిగి ఆ రాష్ట్ర అసెంబ్లీకి చేరింది. పలు కీలక పరిణామాల తర్వాత ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. తమకు పూర్తి బలం ఉందని బీజేపీ ప్రకటించడంతో రేపే బల నిరూపణ చేసుకోవాలని సూచించింది. దీంతో ఇప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాల వేగం పెరిగింది. నంబర్ గేమ్ మొదలు కావడంతో ఎవరికి వారు మద్దతును కూడగట్టే పనిలోపడ్డారు. ఎన్సీపీ, కాంగ్రెస్,శివసేన నేతలపై బీజేపీ గాలం వేసే ప్రయత్నాలు ప్రారంభించింది. 

Supreme Court.

తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక సూచనలు చేసింది. వెంటనే, బల పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత  కూడా ఆలస్యం చేయడం ఏంటని న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం 5 గంటలలోగా విశ్వాసపరీక్ష పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తిచేయించి బలనిరూపణ చేసుకోవాలని సూచించారు. బల పరీక్ష రహస్యంగా కాకుండా వీడియో రికార్డింగ్, ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. దీంతో రేపు ఉదయం సమావేశాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. తాజా తీర్పుతో ఎవరు ఎవరి వైపు ఉండనున్నారనేది తేలనుంది. ఈ తీర్పును సోనియా గాంధీ స్వాగతించారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. 

కాగా బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ సభ్యులు మొత్తం 162 మంది ఉన్నారు. బల పరీక్ష నెగ్గాలంటే 145 మ్యాజిక్ ఫిగర్ ఉంది. కాగా గత నెల జరిగిన ఎన్నికలలో 288 మంది సభ్యులలో కాంగ్రెస్ పార్టీనేత బాలాసాహెబ్ సీనియర్ కావడంతో ప్రొటెం స్పీకర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి కాళిదాస్ కోలాంబ్కర్ కూడా సీనియర్ సభ్యులే. వీరిలో ఎవరి పేరు ఫడ్నవిస్ సూచిస్తారనేది తేలాల్సి ఉంది.