రేపు శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపు శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు..

November 13, 2019

మరో చారిత్రక తీర్పు వెలువరించడానికి చీఫ్ జస్టిస్ రంజాన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సన్నద్ధం అవుతోంది. ఇటీవల రామజన్మ భూమి అయోధ్య భూమి వ్యవహారంలో సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెల్సిందే. తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 

Sabarimala.

సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై మొత్తం 56 రివ్యూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ రోహిటన్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హొత్రాలతో కూడి ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శబరిమలలో 10 వేల మంది పోలీసులను మోహరించారు.