దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై రేపు సుప్రీం తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై రేపు సుప్రీం తీర్పు

May 19, 2022

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది జనవరిలో సిర్పూర్ కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌పై నివేదికను అందించింది.

2019 నవంబర్ 28న జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితులైన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు వారిని ఘటనాస్థలి వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆత్మ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది.