కాషాయ రంగులు వేస్తే ఊరుకుంటారా..ఏపీ సర్కార్‌కు సుప్రీం కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాషాయ రంగులు వేస్తే ఊరుకుంటారా..ఏపీ సర్కార్‌కు సుప్రీం కౌంటర్

March 23, 2020

Supreme

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు తీసి వేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. దీనిపై వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించింది. 

గతంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులను వేశారు. దీనిపై ఓ వ్యక్తి పిటిషన్ వేయడంతో ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. 10 రోజుల్లో పార్టీ రంగులను తొలగించి వేరే రంగులు వేయాలని సూచించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ కోరింది. దీనిపై అత్యున్నత ధర్మాసనం సీరియస్ అయింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీకి సంబంధించిన రంగులు వేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.  వెంటనే వాటిని తొలగించాలని సూచించింది.