శబరిమలకు ప్రత్యేక చట్టం చేయాల్సిందే : సుప్రీం కోర్టు  - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలకు ప్రత్యేక చట్టం చేయాల్సిందే : సుప్రీం కోర్టు 

November 20, 2019

Supreme Order Kerala Govt Exclusive Law in Sabarimala

టీటీడీ తరహాలో శబరిమల ఆలయానికి కూడా ప్రత్యేక బోర్డుతో కూడిన చట్టం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సూచించారు. జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం ధర్మాసనం ముందుకు తీసుకురావాలని ఆదేశించారు. 

కొత్త బోర్డుకు ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి శబరిమలకు కూడా చట్టం తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడింది.చట్టం చేయాలని గతంలోనే చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఆలయానికి ప్రత్యేక చట్టం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టనుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇప్పటికే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే.