ఆర్యసమాజ్‌లో చేసే పెళ్లిళ్లపై సుప్రీం సంచలన తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్యసమాజ్‌లో చేసే పెళ్లిళ్లపై సుప్రీం సంచలన తీర్పు

June 3, 2022

ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అక్కడ జరిగే పెళ్లిళ్లను గుర్తించబోమని, ఆ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఆర్య సమాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదని తేల్చి చెప్పిది. కాగా, కుల, మతాలకు అతీతంగా ప్రేమించుకున్న జంటలు, పెద్దల అంగీకారం లేని వారు ఆర్య సమాజ్‌ను ఆశ్రయిస్తుంటారు. తమ వద్దకు వచ్చిన జంటలకు ఆర్య సమాజ్ పెళ్లిళ్లు చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఇలా పెళ్లి చేసుకున్న జంటలపై కుటుంబ సభ్యులు కక్ష కట్టడం, ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, పరువు హత్యలు పెరిగిపోతుండడంతో ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు పై తీర్పునిచ్చింది.