ప్రైవసీ ప్రాథమిక హక్కే - MicTv.in - Telugu News
mictv telugu

 ప్రైవసీ ప్రాథమిక హక్కే

August 24, 2017

వ్యక్తిగత గోప్యత(ప్రైవసీ) ప్రాథమిక హక్కా? కాదా? అన్ని వివాదానికి సుప్రీం కోర్టు గురువారం తెరదించింది. అది ప్రాథమిక హక్కేనని స్పష్టం చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘ 21వ రాజ్యాంగ అధికరణ  ప్రకారం.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలి. వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తాం’ అని కోర్టు పేర్కొంది.

ఆధార్, పాన్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి వంటి ప్రభుత్వ నిర్ణయాలు గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నాయని దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది.

తీర్పు నేపథ్యంలో వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయకపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు అందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఈ నెపంతో వ్యక్తిగత వివరాలన్నింటిని సేకరిస్తున్నారని, ఆ సమాచారం ప్రైవేట్ సంస్థలకు లీక్ అవుతోందని పిటిషన్లు ధ్వజమెత్తుతున్నారు.