అన్నయ్యకు ఆత్మీయ పలకరింపు..అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం - MicTv.in - Telugu News
mictv telugu

అన్నయ్యకు ఆత్మీయ పలకరింపు..అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

November 27, 2019

అనేక మలుపులు, రాజకీయ ఎత్తుగడల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం ఏర్పడింది. బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. బుధవారం ఉదయం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకార ఘట్టం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం సందడిగా మారింది. రాజకీయ ఎత్తుగడలతో శతృవులుగా కనిపించిన వారంతా.. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలతో మునిగిపోయారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే సందడిగా కనిపించారు. 

Supriya Sule.

అసెంబ్లీలోకి వస్తున్నవారిని పేరు పేరునా పలకరిస్తూ హడావిడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన తన సోదరుడు అజిత్ పవార్‌ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు సుప్రియ. బీజేపీతో చేతులు కలిపి తిరిగి మళ్లీ తమ వద్దకే వచ్చిన ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి. తమ కుటుంబ బంధం విడిపోకూడదంటూ ఇటీవల సుప్రియ వ్యాఖ్యానించారు. తన సోదరుడు తిరిగి రావాలని కోరుకున్నారు. అలాగే తిరిగి రావడంతో పాటు తమ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

అంతే కాకుండా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కరచాలనం చేసి ఆహ్వానించారు. మార్యాద పూర్వకంగా కుశల ప్రశ్నలు వేశారు. తొలిసారి బాల్‌థాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీకి ఎన్నికై ప్రమాణ స్వీకారానికి వచ్చిన  శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే వద్దకు వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయని వాటిని పూర్తి చేయడమే తదుపరి లక్ష్యమని చెప్పారు. ప్రజలంతా తమకు అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు.