గుజరాత్‌లో ‘అసిఫా’ తరహా ఘోరం.. 11 బాలికపై వారంపాటు రేప్, హత్య - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్‌లో ‘అసిఫా’ తరహా ఘోరం.. 11 బాలికపై వారంపాటు రేప్, హత్య

April 14, 2018

ఒకపక్క కశ్మీర్ బాలిక అసిఫా హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అలాంటి మరో ఘోరం వెలుగుచూసింది. గుజరాత్‌లోని సూరత్‌లో 11 ఏళ్ల బాలిక ఛిద్ర మైన మృతదేహం శనివారం బయటపడింది. ఒంటిపై 86 గాయాలు, జననావయవాలు ఛిద్రమై ఉండడంతో అత్యాచారం చేసి గొంతునులిమి చంపేసి ఉంటారని భావిస్తున్నారు.

శరీరంపై ఉన్న గాయాలను బట్టి బాలికను వారం పాటు నిర్బంధించి, అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోందని ఫోరెన్సిక్ నిపుణులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కర్రతో గాయాలు చేసినట్లు కనిపిస్తోందని సివిల్ హాస్పిటల్లోని ఫోరెన్సిక్ హెడ్ తెలిపారు. సూరత్ లోని బేస్తాన్ ప్రాంతంలో ఓ పోలీసుకు బాలిక మృతదేహం కనిపించింది. మృతురాలని ఇంకా గుర్తించలేదు.