ఎవడన్న అప్పులు తీర్శనీకి కొత్త అప్పులు జేస్తడు,లేకపోతే ఎవ్వనికి కనవడకుంట ముల్లె మూట సదుర్కొని ఎటన్న వోతడు కనీ గుజరాత్ కు చెందిన రవిగాంధీ అనే టాయ్న కొత్త ఆలోశన జేశిండు,ఎంటిదన్కుంటున్రా…దొంగనోట్లు అచ్చు గుద్దుడు,మరి దొంగ నోట్లు గుద్దితే ఉన్న అప్పులు వోయి..ఉల్టా అందర్కి నేనే అప్పులియ్యచ్చు అని ఆలోశించిండేమో, గంతే రికాం లేకుంట మిషన్ మీద గుద్దుడే గుద్దుడిగ. మరి వందలా వేలా మనోన్కి 70 లక్షల దాక అప్పులున్నయట.
అప్పులు జేశి బిజినెస్ స్టార్ట్ జేసి నిండా మున్గిండట,అప్పులు ఇచ్చిన వాళ్లు ఊకుంటరా ?ఇగ ఆ అప్పులు తీర్సనీకి నకిలీ నోట్లను తానే ముద్రించి.. వాటిని మార్కెట్లో చెలామణి చేయడం ద్వారా అప్పులు తీర్చాలనుకున్నాడు. లక్ష రూపాయల అసలు కరెన్సీ నోట్లకు రూ. 3లక్షల నకిలీ నోట్లు ఇచ్చే పథకంతో అతను తన అనుచరులతో మార్కెట్లోకి దిగాడు. కానీ ఆయన గాశారం బాలేక పోలీసులకు దొర్కిండు.వారి వద్ద నుంచి రూ. 40.73 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారట పోలీసులు.అప్పులు తీరుద్దామని దొంగదారిల వొయ్యి దొంగనోట్లు గుద్దితే ఆశకు ఊశిగాడు సచ్చిన కతనే అయ్యింది మనోడిది.