రైనా పుత్రోత్సాహం.. రియో వచ్చేశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

రైనా పుత్రోత్సాహం.. రియో వచ్చేశాడు.. 

March 23, 2020

gv vb

టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా రెండోసారి తండ్రి అయ్యాడు. ఈరోజు తెల్లవారుజామున రైనా, ప్రియాంక దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని టీమిండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ ట్వీట్ చేస్తూ.. రైనాకు కంగ్రాట్స్ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2016లో రైనా-ప్రియాంక దంపతులు గ్రేసియాకు జన్మనిచ్చారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ఆ చిన్నారికి తమ్ముడు వచ్చాడు. దీంతో రైనా కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలో రైనా కూడా తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. తమ కొడుకు, గ్రేసియాకు సోదరుడు రియో రైనాను స్వాగతిస్తున్నందుకు తాము గర్విస్తున్నామని వెల్లడించాడు. తమ బుల్లెబ్బాయి బౌండరీల పరిధులు దాటి ఎదగాలని ఆకాంక్షించాడు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, మహమ్మద్ కైఫ్‌లు రైనా శుభాకాంక్షలు చెప్పారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన ట్విటర్ ఖాతా ద్వారా ‘కుట్టి తాలాకు స్వాగతం’ అని ట్వీట్ చేసింది. తమిళనాడులో రైనాను అభిమానులు ‘చిన్న తాలా’ అని పిలుస్తుంటారు. అందుకే సీఎస్‌కే ఇలా వెరైటీగా ట్వీట్ చేసింది. కాగా, రైనా చివరిసారి జూలై 2018న భారత్‌కు ఆడాడు. 2011 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ 2019 వరకు మళ్లీ మైదానం ముఖం చూడలేదు. గతేడాది ఆగస్టులో మోకాలి ఆపరేషన్ చేయించుకోగా.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.