Suresh Raina retires from IPL, to play in overseas T20 leagues
mictv telugu

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా క్రికెటర్ రైనా

September 6, 2022

టీమిండియా క్రికెటర్‌ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ‘‘ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నా సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌, చెన్నై టీం, రాజీవ్‌ శుక్లా సర్‌, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని రైనా రాసుకొచ్చాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున రైనా ఐపీఎల్ ఆడాడు. అయితే 2022 సీజ‌న్‌లో ఆ జ‌ట్టు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు. త‌న‌పై నమ్మ‌కం ఉంచిన‌వారికి, మ‌ద్ద‌తు ఇచ్చిన అభిమానుల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు. 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. రైనా 226 వ‌న్డేల్లో 5615 ర‌న్స్‌, 78 టీ20ల్లో 1605 ర‌న్స్ చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రైనా ఐదో స్థానంలో ఉన్నాడు. రైనా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు ఓవర్సీస్ టీ20 లీగ్ ఆడటానికి అర్హుడు కాదు. విదేశాల్లోని లీగ్‌ల్లో ఆడటం కోసం రైనా ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది.