కోరోనా..  సూర్య కుటుంబం రూ.10 లక్షల సాయం - MicTv.in - Telugu News
mictv telugu

కోరోనా..  సూర్య కుటుంబం రూ.10 లక్షల సాయం

March 23, 2020

Suriya and Karthi, along with father Sivakumar

కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్య వల్ల పెద్ద పెద్ద స్టార్లకు ఏ సమస్యా లేదు. ఎంచక్కా వారు ఇంట్లో కుటుంబ సభ్యులతో గుడుపుతున్నారు. కానీ, షూటింగ్ ఉన్ననాడే కడుపు నింపుకునే కర్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది? వారికి షూటింగ్ లేదంటే కుటుంబ సభ్యులు కూడా కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కొందరు సినీ పెద్దలు వారి పరిస్థితిపై కరుణ చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో అలాంటి రోజూవారి సినీ కార్మికుల కోసం హీరో రాజశేఖర్ నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్టు తెలిపారు. 

ప్రకాశ్ రాజ్ సైతం తనవద్ద పనిచేసే ఉద్యోగస్తులందరికీ జీతాలు ముందుగానే ఇచ్చినట్టు తెలిపారు. ఈ సమయంలో తనను ఎవరు సాయం అడిగినా చేస్తానని తెలిపారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం ‘ఫెఫ్సీ’కి సూర్య కుటుంబం విరాళం ప్రకటించింది. సూర్య, ఆయన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ సినీ కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ రూ.10 లక్షల విరాళం అందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ మూతపడడంతో ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఈ విరాళం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.