బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఆఫీస్ కు రావక్కర్లేదు, ఇంట్లోనే పడుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 17 వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మొత్తం కంపెనీ అంతటికీ సెలవు ఇచ్చేసింది.
పడుకోవడానికి అనువైన బెడ్‌లను తయారు చేసే కంపెనీ అదే. అలాంటి తామే వరల్డ్ స్లీప్ డే నాడు సెలవు ఇవ్వకపోతే ఎలా అనుకుందో ఏమో. మొత్తం దేశంలో తమ ఉద్యోగులు ఎవరూ ఈరోజు ఆఫీస్‌కు రావక్కర్లేదని ప్రకటించింది. వేక్ ఫిట్ సొల్యూషన్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్ స్టార్టప్ కంపెనీ లింక్డిన్‌లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్ అనేది దాని ట్యాగ్ లైన్. ఇది తన ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ స్క్రీన్ షాట్.
ఈ కంపెనీ ఇలాంటి పనుల చేయడం మొదటిసారేమీ కాదు. లాస్ట్ ఇయర్ కూడా తమ ఉద్యోగులకు రైట్ టు నాప్ పాలసీని ప్రకటించింది. అంటే ఉద్యోగులు తమ పని వేళల్లో రోజులో ఓ అరగంట నిద్రపోవచ్చు అని. పనిలో నాణ్యత పెంచేందుకే తాము ఈ విధంగా ప్రోత్సహిస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఆఫ్టర్ నూన్ నాప్ వల్ల ఉద్యోగులు రీఛార్జ్ అవుతారని, మరింత మంచిగా పని చేస్తారని అంటోంది. అలాగే ఈ రోజు సెలవు కూడా అందుకే అని చెబుతోంది. వరల్డ్ స్లీప్ డే అంటే అందరూ పడుకోవాలి కదా అంటోంది. మిగతా కంపెనీలు కూడా తమలానే ఆలోచించాలని పిలుపునిస్తోంది.