Surrender of 60 Maoists in AP
mictv telugu

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వారిలో ఎమ్మెల్యేల హంతకులు

June 28, 2022

ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 60 మంది మావోయిస్టులు అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 27 మంది మిలీషియా సభ్యులు, ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. అంతేకాక, లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసులో నిందితులు కూడా ఉన్నారు. ఈ 60 మంది కోరుకొండ, పెదబయలు దళాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టులతో పాటు వారి డంపును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరికృష్ణ, ఎస్పీ సతీష్ తెలిపారు. కాగా, ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. ఈ లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు.