SURVEY ON TELUGU HEROS, MOVIES
mictv telugu

తెలుగు హీరోల క్రేజ్ మామూలుగా లేదు…

November 19, 2022

SURVEY ON TELUGU HEROS, MOVIES

తెలుగు సినిమా ఇప్పుడో క్రేజ్. తెలుగు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు. బాహుబలితో మొదలైన తెలుగు సినిమా ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొత్తం భరాతదేశాన్ని మన సినిమాలు ఒక ఊపు ఊపేస్తూనే ఉన్నాయి. ఇక హీరోల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. నిజం చెప్పాలంటే మన వాళ్ళు వాళ్ళ డైలాగ్ లు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల మారుమోగుతున్నాయి. కంటెంట్, స్టోరీ ఇలాంటివన్నీ పక్కన పెడితే బాలీవుడ్ వాళ్ళ రొటీన్ సెక్స్, క్రాస్ కనెక్షన్ సినిమాలు చూసి విసుగెత్తిపోయిన నార్త్ ఇండియన్స్ కు మన సినిమాలను పిచ్చపిచ్చగా చూసేస్తున్నారు. మన సినిమాల్లోని మాస్ ని తెగ ఇష్టపడుతున్నారు.

మన సినిమాలు, హీరోలు ఎంత పాపులరో ఈ మధ్య ఒక సర్వే నిర్వహించారు. అందులో ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారులాంటివి జనాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్‌ గా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. అక్టోబరు నెలకి సంబంధించి ఓర్మాక్స్ మీడియా (Ormax Media ) నిర్వహించిన సర్వేలో ప్రభాస్‌కే ఎక్కువ మంది ఓటేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగిపోయాడు. దాని తర్వాత వచ్చిన రెండు సినిమాలు బోల్తా కొట్టినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అలానే నాని ఏడు, విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలవగా.. మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానానికి పడిపోయారు. వెంకటేశ్ పదో స్థానంలో నిలిచారు. టాప్-10లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీయార్, రామ్ చరణ్ కు బాగా క్రేజ్ వచ్చింది. సినిమాలో రామ్ చరణ్ పాత్రే చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం ఎన్టీయార్ కే వచ్చిందన్న విషయం ఈ సర్వేతో స్పష్టమైపోయింది. మొన్నటికి మొన్న జపాన్ వెళ్ళినప్పుడు కూడా జూ ఎన్టీయార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో తెలిసిపోయింది. అక్కడ జపనీస్ అతని వెంట పడిన దానిబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాలో అతని పాత్ర ఎంత ఇంపాక్ట్ పడిందో తెలుస్తోంది. ఇక పెష్ప సినిమాతో అల్లు అర్జున్ అయితే ఓ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ కు అందరూ ఫిదా అయిపోయారు. అతను చెప్పిన డైలాగ్ లు కూడా చాలా పాపులర్ అయిపోయాయి. ఇప్పుడు పుష్ప-2 సినిమా కోసం జనాలు తెగ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఉన్నారు. మహేష్ క్యూట్ లుక్స్ కి జనాలు పడిపోతుంటారు. అసలు మహేష్ కి మొదటి నుంచే నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు.