మలయాళ సినిమా రీమేక్ లో సూర్య బ్రదర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మలయాళ సినిమా రీమేక్ లో సూర్య బ్రదర్స్

May 29, 2020

Surya

ప్రస్తుతం చిత్రసీమలో మల్టీ స్టారర్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా తమిళ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ కూడా ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో పృథ్వీ-బిజూ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ మంచి విజయం సాధించింది. అయితే, ప్రముఖ నిర్మాత కథిరెన్ ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లో సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలుబడాల్సి ఉంది.