Suryakumar Super..Great win for India
mictv telugu

సూర్యకూమార్ సూపర్..భారత్ ఘన విజయం

August 3, 2022

t20

వెస్టిండిస్, భారత్ జట్ల మధ్య గతకొన్ని రోజులుగా టీ20 మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో విఫలమైన భారత జట్టు గతరాత్రి జరిగిన మూడోవ మ్యాచ్‌లో దుమ్మురేపింది. యుగ ఆటగాడు సూర్యకూమర్ యాదవ్ చేలరేగిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 76 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు 7 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్..20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ పూరన్ 22, రోవ్‌మన్ పావెల్ 23, హెట్మెయిర్ 20 పరుగులు చేశారు.

అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కానీ, సూర్యకుమార్ యాదవ్ మాత్రం చెలరేగిపోయాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక, శ్రేయాస్ 24, రిషభ్ పంత్ 33 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా నాలుగు, దీపక్ హుడా 10 పరుగులు చేశారు. నాలుగో టీ20 ఈ నెల 6న ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌లో జరుగనుంది.