Suryakumar Yadav achieved 3 records in a single match
mictv telugu

ఒకే మ్యాచ్‌లో 3 రికార్డులు సాధించిన సూర్యకుమార్ యాదవ్

September 1, 2022

ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తన పేరిట మూడు రికార్డులను లిఖించుకున్నాడు. తన సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు బాదిన సూర్య.. ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకు ముందు ఏ భారత ఆటగాడు కూడా 3 సిక్సర్ల కంటే ఎక్కువ కొట్టలేదు. అలాగే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సూర్య 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఆఖరి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఇక మూడో రికార్డు విషయానికి వస్తే కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి కెప్టెన్ రోహిత్ శర్మ సరసన చేరాడు.