Suryakumar Yadav in line to replace Ravindra Jadeja for Bangladesh Tests
mictv telugu

ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్ యాదవ్ ?

November 23, 2022

Suryakumar Yadav in line to replace Ravindra Jadeja for Bangladesh Tests

భారత సంచలన ఆటగాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది కాలంగా సత్తా చాటుతున్నాడు. క్రికెట్ లోకానికి నమ్మశక్యం కాని షాట్లను పరిచయం చేస్తూ దుమ్ములేపుతున్నాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ నుంచి నిన్నటి న్యూజిలాండ్ సిరీస్ వరకు అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం 1 స్థానాన్ని దక్కించుకుని..కొనసాగుతున్నాడు.ఇప్పటికే ఇండియా తరఫున టీ20, వన్డేల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించడంపై దృష్టి సారించింది.

న్యూజిలాండ్ సిరీస్ అయ్యాక బంగ్లాదేశ్‌‌ తో భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇందు కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఎంపిక చేశారు. అయితే జడేజా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ అవకాశం లేకపోవడంతో అతడి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇప్పటికే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో అతడి స్థానంలో అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని కూడా టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరలోనే టెస్టుల్లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ సూర్య టెస్టు జట్టులో స్థానం కల్పిస్తే మాత్రం మరిన్ని అద్భుతాలు క్రికెట్ అభిమానులు చూసే అవకాశం ఉంటుంది.