పొట్టి ఫార్మాట్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డులను ప్రకటించింది. పురుషుల తరపున టీమిండియా విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో భారత్ నుంచి ఈ అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2022లో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు, 68 సిక్సర్లతో అసాధారణ ఆటతీరు కనపరిచాడు. ముఖ్యంగా సిక్సర్ల విషయంలో మరే ఇతర ఆటగాడు సూర్యకు దరిదాపుల్లో కూడా లేరు. అటు టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్య ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా అవార్డుతో 2022 సంవత్సరం సూర్యకు మరుపురాని ఏడాదిగా నిలిచిపోయింది. అటు బౌలర్ సిరాజ్ వన్డేల్లో అగ్రస్థానానికి ఎగబాకడం తెలిసిందే. ఇక మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన తహ్లియా మెక్‌గ్రాత్ ఎంపికైంది. ఈమె సూర్యకుమార్ యాదవ్లాగే టీ20ల్లో నెంబర్ 1 బ్యాటర్‌గా ఉండడం విశేషం. భారత మహిళా బౌలర్ రేణుకా సింగ్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.