లింగమార్పిడి చేసుకున్నాక  పెళ్లికి నో అన్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

లింగమార్పిడి చేసుకున్నాక  పెళ్లికి నో అన్నాడు..

December 3, 2019

Suryapeta district transgender marrige 

ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మహిళగా మారితేనే పెళ్ళిచేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండవ యువకుడు లింగమార్పిడి చేసుకున్నాడు. చివరి నిమిషంలో ఆ యువకుడు మొహం చాటేయడంతో పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది.

సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అదే జిల్లాకు చెందిన గుండ్లగాని సాయితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి షరతు పెట్టాడు. దీంతో జానయ్య లింగమార్పిడి చేయించుకుని మహిళగా మారాడు. జానయ్య మహిళగా మారిన తర్వాత సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో జానయ్య పోలీసులను ఆశ్రయించాడు. వీరికి తీర్పు ఎలా చెప్పాలో తెలియక పోలీసులు తలల పట్టుకున్నారు.