సుశాంత్‌ది హత్యే.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్‌ది హత్యే.. వీడియో వైరల్

August 3, 2020

Sushant Case Evidence Video

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  చనిపోయి నెలన్నర దాటినా కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ఆయన మరణంపై రకరకాల వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అది ఆత్మహత్య కాదని, హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. అతనిది హత్యే అనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా  ఓ వీడియోలో వివరించారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సుశాంత్ సింగ్ మరణం వెనక ఉన్న విషయాల్లో కొన్ని ప్రశ్నలను సందించారు. 

 ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పారు. వీటి ఆధారంగా చూస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇవి బలమైన ఆధారాలని అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు చాలా మంది మద్దతు కూడా తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు మాత్రం విచారణ సమయంలో సన్నిత విషయాలను ఇలా బహిర్గతం చేయడం సరైంది కాదని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారానికి ఎప్పుడు తెరపడుతోందనని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.