సుశాంత్‌కు రియా చేతబడి చేయించింది.. సోదరి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్‌కు రియా చేతబడి చేయించింది.. సోదరి ఫైర్

August 1, 2020

Sushant singh rajpurt's sister Mitu Singh says Rhea Chakraborty used to do black magic

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెల్సిందే. సుశాంత్ కుటుంబ సభ్యులు, ఆయన శ్రేయోభిలాషులు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై రోజురోజుకి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రియా భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుందని.. అలాగే డాక్టర్‌ ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులను అతడికి ఇచ్చిందనే ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే. 

తాజాగా రియా చక్రవర్తి.. సుశాంత్‌ ప్లాట్‌లో క్షుద్ర పూజలు చేయించేదని అతడి‌ సోదరి మితు సింగ్‌ ఆరోపించింది. ఇందుకోసం ఆమె ఒక తాంత్రికుడిని ఫ్లాట్ కి పిలిపించేదని తెలిపింది. సుశాంత్‌ ఫ్రెండ్ నీలోత్పల్‌ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్‌ మరణంపై దర్యాప్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మితు సింగ్ లేఖ రాసింది. 

సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ తన సోదరుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో అన్ని విషయాలూ పరిశీలించాలని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడాలని ప్రధాని మోదీని కోరింది. సత్యం కోసం మీరు నిలబడతారని నాకు తెలుసు.. మాది సాధారణ కుటుంబం.. నా సోదరుడికి బాలీవుడ్ లో ఏ గాడ్ ఫాదర్ లేరు.. దయచేసి శానిటైజ్డ్ పద్దతిలో ఆధారాలు తారుమారు కాకుండా చూడండి అని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.