సుశాంత్ కేసులో ట్విస్ట్.. మనీలాండరింగ్ కేసు పెట్టేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ కేసులో ట్విస్ట్.. మనీలాండరింగ్ కేసు పెట్టేశారు.. 

July 31, 2020

Sushant Singh Rajput case, ED files money laundering case.

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యపై ముంబై, పట్నాల్లో కేసులు నమోదైన సంగతి తెల్సిందే. ఈ రెండు కేసుల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 

తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ)‌ కూడా కేసు నమోదు చేసింది. గురువారం సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో ఈరోజు కేసు నమోదు చేశారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ముంబైలో బిహార్ పోలీసులు జరిపిన దర్యాప్తుపై పాట్నాలోని డిజిపి ఆఫీస్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ మొత్తంలో సుశాంత్ డ‌బ్బును అతడి గర్ల్ ఫ్రెండ్ అక్ర‌మ రీతిలో వాడుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈడీ‌ విచారించాలని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ ఇప్పటికే కోరారు.