డ్రగ్స్ తీసుకున్నా.. అంగీకరించిన శ్రద్ధాకపూర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ తీసుకున్నా.. అంగీకరించిన శ్రద్ధాకపూర్ !

September 26, 2020

Sushant Singh Rajput Case: Shraddha and Sara Leave NCB Office, Kshitij Prasad to be Presented in Court Tomorrow

డ్రగ్స్ తీసుకున్నానని ఎన్సీబీ ముందు బాలీవుడ్ యువనటి శ్రద్ధాకపూర్ అంగీకరించింది. తాను CBD అనే డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో వెల్లడించింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్దాని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే శ్రద్ధాతో పాటు దీపికా, సారా అలీఖాన్‌, రకుల్ ప్రీతిసింగ్‌లను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. సుశాంత్‌తో కలిసి శ్రద్ధ ‘చిచోరే’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పార్టీ జరిగిందని.. ఆ పార్టీలో చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారని శ్రద్ధ చెప్పింది. అయితే ఆ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని.. ఆ పార్టీలో డ్రగ్స్ ఇచ్చినవాళ్లు ఎవరో తనకు తెలియదంటూ శ్రద్ధ చెప్పింది. ఒకవేళ వాళ్లను చూస్తే మాత్రం వాళ్లను గుర్తు పడతానని తెలిపింది. అంతేకాదు అపుడపుడు షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్‌లో సుశాంత్ డ్రగ్స్ వాడినట్టు శ్రద్ధా తెలిపింది. 

మరోవైపు ఈరోజు ఉదయం మరో హీరోయిన్ దీపికా పదుకొణె నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ముందు విచారణకు హాజరైంది. ఈ కేసులో దీపికాను నార్కొటిక్స్ అధికారులు 6 గంటల పాటు విచారించారు. ఆమె నుంచి అధికారులు పలు కీలక వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించారు. విచారణలో రకుల్ మరో నలుగురి పేర్లని బయట పెట్టినట్టు తెలుస్తోంది. తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు కానీ రియా డ్రగ్స్‌ని తీసుకొచ్చి తన ఇంట్లో దాచిపెట్టేది అని చెప్పినట్టు సమాచారం. కాగా, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారిస్తున్న అధికారులకు బాలీవుడ్‌లోని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలియడంతో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.