సుశాంత్ హెలికాఫ్టర్ షాట్ వీడియో వైరల్..మీరు చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ హెలికాఫ్టర్ షాట్ వీడియో వైరల్..మీరు చూడండి

July 13, 2020

hgbgc

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని ఆయన అభిమానులు ఇంకా మర్చిపోవడం లేదు. ఇప్పటికీ ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా సుశాంత్ కు సంబంధించిన మరో వీడియో సోషల్ చక్కర్లు కొడుతోంది.

అందులో సుశాంత్ భారత మాజీ కెప్టెన్ ధోని స్టైల్ లో హెలికాఫ్టర్ షాట్ కొడుతున్నాడు. ఆ వీడియోలో సుశాంత్ బాడీ లాంగ్వేజ్ ధోని మాదిరిగా ఉండడం గమనార్హం. ధోని బయోపిక్ కోసం క్రికెట్ ఆడడం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సుశాంత్ ఈ షాట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ ఈ నెల 24న హాట్ స్టార్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై విడుదలకు సిద్ధం అవుతోంది.