సుశాంత్‌ అంటే పిచ్చి.. ఇంట్లో విగ్రహం పెట్టుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్‌ అంటే పిచ్చి.. ఇంట్లో విగ్రహం పెట్టుకున్నాడు

September 18, 2020

n cgn g

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను స్మరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్‌కు చెందిన సుకాంతో రాయ్‌ అనే శిల్పి సుశాంత్‌ కి అరుదైన నివాళి అర్పించాడు. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మ్యూజియంలో సుశాంత్‌ జ్ఞాపకార్థం ఏకంగా మైనపు విగ్రహాన్నే రూపొందించాడు. 

‘సుశాంత్ అంటే నాకు ఎనలేని అభిమానం. అతడి సినిమాలు అన్ని చూశాను. అతడి ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. అతనికి గుర్తుగా నా మ్యూజియం కోసం నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను. సుశాంత్‌ విగ్రహం కోసం అతని కుటుంబ సభ్యులు నన్ను సంప్రదిస్తే మరొక విగ్రహాన్ని తయారు చేస్తాను.’ అని తెలిపాడు. రాయ్ గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, క్రికెటర్ విరాట్‌ కోహ్లీ మైనపు విగ్రహాలను కూడా‌ తయారుచేశాడు. జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి మరణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నారు.