సింగిల్ టేకులో సాంగ్ పూర్తి చేసిన సుశాంత్! - MicTv.in - Telugu News
mictv telugu

సింగిల్ టేకులో సాంగ్ పూర్తి చేసిన సుశాంత్!

July 11, 2020

Sushant Singh Rajput single take son

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కొద్దీ రోజుల క్రితం ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అది అలా ఉంటే ఆయన నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ ను డైరెక్ట్ గా హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హలీవుడ్ రొమాంటిక్ డ్రామా ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’కు రీమేక్‌గా వస్తోంది.  ముఖేశ్ చబ్రా దర్శకత్వం వహించిన దిల్ బెచారా జులై 24 నుండి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్​ సాంగ్ ను విడుదల చేసింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలకు సుశాంత్ తనదైన స్టైల్‌తో డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాటకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ ను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సింగిల్ టేక్‌లో పూర్తి చేశాడు. ఈ విషయం అభిమానుల మనసుల్ని కదిలిస్తోంది. దాదాపు 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న ఈ సాంగ్ మొత్తాన్ని సింగిల్​ టేక్​లో సుశాంత్ కంప్లీట్ చెయ్యడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.