సుశాంత్‌లాగే ఉన్నాడే.. వీడియోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్‌లాగే ఉన్నాడే.. వీడియోలు వైరల్

July 8, 2020

Sushant Singh

బాలీవుడ్ బంధుప్రీతి, కెరీర్‌లో ఒడిదొడుకులతో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు విషాదం నుంచి తేరుకోవడం లేదు. ఆయన ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రతిభావంతుడైన నటుణ్ని కోల్పోయమని బాలీవుడ్ వర్గాలు అతన్ని గుర్తుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో సుశాంత్‌ పోలికలు ఉన్న ఓ యువకుడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీకి చెందిన ఇతని పు సచిన్ తివారీ. ఫిట్నెస్ ట్రైనర్‌గా కెరీర్ ప్రారంభిస్తున్న సచిన్ టిక్‌టాక్‌లో చాలా వీడియోలు పోస్ట్ చేశాడు. అచ్చం సుశాంత్ లాగే ఉన్నాడని అభిమానులు అతన్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు. ‘అచ్చం అదే హెయిల్ స్టయిల్, దవడ స్ట్రక్టర్ కూడా సుశాంత్‌కు ఉన్నట్టే ఉంది.  బాలీవుడ్ అతనికి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. సుశాంత్ చిత్రం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ లోని టైటిల్ సాంగ్‌కు సచిన్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. 

View this post on Instagram

😍😍😍😍

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on