సుశాంత్ మాజీ మేనేజర్‌పై రేప్, హత్య.. మాజీ సీఎం ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మాజీ మేనేజర్‌పై రేప్, హత్య.. మాజీ సీఎం ఆరోపణ

August 4, 2020

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే, సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెది ఆత్మహత్య కాదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. దిశా అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె ప్రైవేట్‌ భాగాలపై గాయాల మరకలు ఉన్నాయని వెల్లడైందని తెలిపారు. దిశా, సుశాంత్‌ల మృతి కేసుల్లో దోషులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. దిశా కుటుంబంపై ఒత్తిడి తెస్తుండటంతో వారు ఆమె మృతిపై విచారణ కోరడం లేదని చెప్పారు. 

నటుడు డినో మోరియా ఇంట్లో జూన్‌ 13 రాత్రి పార్టీ జరిగిందని, ఆ తర్వాత పార్టీకి హాజరైన వారు సుశాంత్‌ ఇంటికి వెళ్లారని రాణే వివరించారు. ఓ రాజకీయ నేత కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని అన్నారు. ఇదిలావుండగా తండ్రి వ్యాఖ్యలపై ఆయన కుమారుడు బీజేపీ నేత నితీష్‌ రాణే స్పందిస్తూ.. విశ్వసనీయ సమాచారం ఉండటంతోనే తన తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటారని అన్నారు. ఈ వివరాలను త్వరలోనే సంబంధిత అధికారుల ఎదుట వెల్లడిస్తామని తెలిపారు. ‘సుశాంత్‌ మృతిపై వాస్తవాలు వెలుగులోకి రాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారు. తమవారిని కాపాడుకోవడానికి యత్నిస్తున్నారు’ అని నితీష్ రాణే స్పష్టంచేశారు. ఇదిలావుండగా సుశాంత్ మృతితో తనకు ఎలాంటి లింకు లేదని మహారాష్ట్ర మఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఆదిత్యనాథ్ ఠాక్రే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఆయనపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాగా, జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్యకి ముందురోజు సుశాంత్‌ ఇంట్లో పార్టీ జరిగిందనే ఆరోపణలను ముంబై పోలీస్‌ చీప్‌ పరంవీర్‌ సింగ్‌ గతంలో తోసిపుచ్చిన విషయం తెలిసిందే.