చూడతరమా.. ప్రియుడితో సుస్మిత వ్యాయామం - MicTv.in - Telugu News
mictv telugu

చూడతరమా.. ప్రియుడితో సుస్మిత వ్యాయామం

September 13, 2019

 

బాలీవుడ్ హీరోయన్లు, హీరోలు ఫిట్‌నెస్‌పై దృష్టి ఎక్కువగా పెడతారు. షూటింగ్ వుంటే పని చేసుకుంటారు. షూటింగ్ లేకపోతే జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఒక్కోసారి షూటింగ్‌లో కూడా జిమ్ చేస్తుంటారు. షూటింగ్‌కు వెళ్లినప్పుడు వాళ్లు బసచేసే హోటళ్లలో జిమ్ వెసలుబాటు వుంటుంది. దీంతో అక్కడ కూడా వాళ్లు ఫిట్‌నెస్ మంత్రాన్ని జపిస్తుంటారు. సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్ కూడా ఫిట్‌నెస్‌కుఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్‌ రొహ్మాన్ షాల్‌తో కలిసి వర్కవుట్స్‌ వీడియోలను సోషల్‌మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుంది. 

తాజాగా సుస్మిత రొహ్మాన్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఈ వర్కవుట్‌లో.. బలం, బ్యాలెన్స్‌, రూపం, ఫ్లెక్సీబులిటీ ఉండొచ్చు. ప్రధానంగా నమ్మకం అనేది లేకపోతే ఇవేమి సాధ్యం కావు. రొహ్మాన్‌ షాల్‌ నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం నేను వెనక్కి వంగాను. నాకు తెలుసు నువ్వు నన్ను కింద పడకుండా పట్టుకుంటావని’ అని సుస్మిత క్యాప్షన్ ఇచ్చింది. వీరి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేలా ఉన్న ఈ వర్కవుట్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, సుస్మిత వయసు ఇప్పుడు 43 ఏళ్లు. రొహ్మాన్ వయసు 28 సంవత్సరాలు. ఇద్దరిమధ్య వయసు తేడా 15ఏళ్లు వుంటుంది. అయినా ఈ జంట వయసు వ్యత్యాసం తెలియకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా వుంటారు. సుస్మిత చివరిసారిగా 2010లో వచ్చిన ‘నో ప్రాబ్లెమ్2’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా వుంటోంది.