ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు కోసమే 56 ఏళ్ల ముసిలాడితో రొమాన్స్ చేస్తోందని పలువులు విమర్శిస్తున్నారు. సస్మిత వయసు కూడా తక్కువేం కాదని, వాళ్ల ప్రేమను తప్పుబట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. డబ్బంటే ఎవరికి చేదు అని మరికొందరు అంటున్నారు. ఈ కామెంట్లపై 46 ఏళ్ల సుస్మిత ఘాటుగా స్పందించింది. ‘నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా, పోయి పనిచూసుకోండి..’ అనే అర్థంలో సోషల్ మీడియాలో స్పందించారు.
‘‘నా చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారుతోంది. నాకు చాలా బాధగా ఉంది. కొంతమంది మేధావులు, పుకార్లరాయుళ్లు నేను డబ్బు కోసం పాకులాడుతున్నానని(గోల్డ్ డిగ్గింగ్) తమ అమూల్య అభిప్రాయాలను సెలవిస్తున్నారు. నాకు బంగారానికంటే వజ్రాలంటే ఇష్టం. వాటిని కొనుక్కునే స్థాయి కూడా ఉంది. నేను తాత్కాలిక ప్రశంసల కోసం నా జీవితాన్ని మార్చుకోను’’ అని సుస్మిత అన్నారు. ఇదివరకు సుస్మిత రణదీప్ హుడా, రోమన్ షాల్, విక్రమ్ భట్, వసీం అక్రమ్, బంటీ సచ్ దేవ్, ఇంతియాజ్ ఖత్రీ, ముదాస్సర్ అజీజ్ తదితరులతో సన్నిహింతగా ఉండింది.