Sushmita Sen goes out shopping with ex-boyfriend Rohman Shawl
mictv telugu

మాజీ బాయ్ ఫ్రెండ్‌తో సుస్మిత మళ్లీ తాజాగా.. పాపం మోదీ అంటున్న నెటిజన్లు

August 30, 2022

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో సుస్మితా సేన్ ఒకరు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా మారిన ఈ బ్యూటీ ప్రేమాయణాలకు మాత్రం కొదువ లేదు. తనకన్నా చిన్నవాడైన నటుడు రోహమన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి, సహజీవనం చేసిన ఈ జంట సడెన్ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. లాస్ట్ డిసెంబర్‌లో రెండో ప్రియుడైన రోహమన్‌తో బ్రేకప్ చెప్పిన సుస్మితా.. ముచ్చటగా ఐపీఎల్ కింగ్ లలిత్ మోడీతో జతకట్టింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, ప్రస్తుతానికైతే ప్రేమలో మునిగి తేలుతున్నామని చెప్పుకొచ్చారు. వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి

ఇక లలిత్ ప్రేమను ప్రకటించి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే సుస్మితా మాజీ ప్రియుడు తో కారులో కనిపించింది.. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మన్‌ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్‌ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్‌ చేస్తున్నారు. రోహమన్‌తో షాపింగ్ చేస్తూ కనిపించిన సుస్మితను చూసి.. లలిత్ ను సైడ్ చేసి మాజీ ప్రియుడను మళ్లీ సెట్ చేసుకుంటుందా..? అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే రోహమన్, సుస్మిత దత్తత పిల్లలకు తండ్రిగా మారాడని, వారి కోసమే రోహామాన్ సుస్మితను కలుస్తున్నాడని, వారి ఆనందం కోసమే ఇలా షాపింగ్ లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.