బాలీవుడ్ నటి సుస్మితా సేన్ హార్ట్ ఎటాక్‌కు గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె సోషల్ మీడియా వేదికగా గుండెపోటుకు గురైనట్లు వెల్లడించారు. హార్ట్ స్ట్రోక్‌కు సంబంధించిన యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నట్లు అభిమానులకు తెలిపారు.
“మీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు అది మీకు అండగా నిలుస్తుంది. నేను కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో బాధపడ్డాను. యాంజియోప్లాస్టీ పూర్తయింది. స్టెంట్ కూడా వేశారు. నాకు పెద్ద హృదయం ఉందని కార్డియాలజిస్ట్ చెప్పారు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. మళ్ళీ కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సుస్మితా సేన్. ఈ సందర్బంగా తన తండ్రితో ఉన్న ఫోటోను పంచుకున్నారు. రెండు రోజులు క్రితం సుస్మితా సేన్ హార్ట్ స్ట్రోక్ కు గురైనట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలం గుండెలు ఆగిపోవడం భయపెడుతోంది. ఎవరు ఎప్పుడూ గుండెపోటుకు గురువతున్నారో చెప్పలేని పరిస్థితి. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు గుండెపోటుకు గురవుతున్నారు. దీంతో మన గుండె భద్రమేనా అనే సందేహాం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. రోజు కంటముందు కలుగుతున్న సడన్ డెత్‌లు మనలో భయాన్ని సైతం పెంచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
తారకరత్న దశదిన కర్మ..హాజరైన కుటుంబ సభ్యులు
బాలీవుడ్ ఆఫర్ కు నో చెప్పిన పుష్పరాజ్