Sushmita Sen watched the movie with her ex-boyfriend
mictv telugu

సుస్మితాసేన్ డబుల్ గేమ్.. మోదీతో డేటింగ్‌ చేస్తూ మాజీ లవర్‌తో సినిమాకు

August 11, 2022

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో డేటింగ్‌ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి మీడియా ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని లలిత్ మోదీ కూడా ప్రకటించాడు. దీంతో ఈ విషయంపై విపరీత చర్చ జరిగింది. ఈ జంటను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. డబ్బు కోసమే మోదీని ట్రాప్ చేసిందని చాలా మంది సుస్మితాను విమర్శించారు.

ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మోదీకి ముందు ప్రేమించిన రోహ్మన్ షాల్‌తో కలిసి సుస్మితా తాజాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాకు వచ్చేసింది. వీరితో పాటు సుస్మితా దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రోహ్మన్ సుస్మితా పిల్లలతో చాలా సరదాగా ఉండడం మీడియా కెమెరాకు చిక్కింది. ఇదేకాక, ఆగస్టు 8న సుస్మితా తల్లి పుట్టినరోజు వేడుకల్లో కూడా రోహ్మన్ కనిపించాడు. సుస్మితా తీసిన వీడియోలో రోహ్మన్ పిల్లలతో మాట్లాడుతుండగా, కెమెరా వైపు చూడండి అని సుస్మితా పిల్లలకు చెప్పడంతో అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో నెటిజన్లు మరింత ఆశ్చర్యపోయారు. మాజీ ప్రియుడితో ఇంత క్లోజ్‌గా ఉంటే, మరి ప్రస్తుత లవర్ లలిత్ మోదీ ఎక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు సుస్మితా ఆడుతున్న డబుల్ గేమ్‌ని ఎండగడుతున్నారు.