విమాన ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విమాన ప్రమాదంలో నలుగురు భారతీయుల మృతి

May 30, 2022

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తారా ఎయిర్ లైన్స్‌కు 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. మొత్తం 22 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం నిన్న ఉదయం ముస్తాంగ్ జిల్లాలోని కోవాంగ్‌లో కూలిపోయింది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. విమాన శకలాల నుంచి 14 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. అయితే విమానంలోని ఏ ఒక్కరూ బతకలేదని, మొత్తం 22 మంది చనిపోయారని నేపాల్ మీడియా తెలిపింది.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. హాలీడే ట్రిప్ కోసం నేపాల్ వెళ్లిన 54 ఏళ్ల అశోక్ త్రిపాఠి, అతని భార్య వైభవి బాండేకర్-త్రిపాఠి(51), కుమారుడు ధన్యస్య త్రిపాఠి(22), కుమార్తె రితికా త్రిపాఠి (18) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు థానేలోని రుస్తోమ్‌జీ ఎథీనా భవనంలో నివసిస్తున్నట్లు తెలిసింది.

విమాన సిబ్బందిలో కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరేలే, ఫ్లైట్ ఆపరేటర్ కిస్మి థాపా, సిబ్బంది అర్కా, ఉత్సవ్ పోఖరెల్లె మరణించారు. ప్రయాణికుల్లో ఇంద్ర బహదూర్ గోలే, పురుషోత్తం గోలే, రాజన్‌కుమార్ గోలే, మైక్ గ్రీట్ గ్రాఫ్, బసంత్ లామా, గణేష్ నారాయణ్ శ్రేష్ఠ, రవీనా శ్రేష్ఠ, రష్మీ శ్రేష్ఠ, రోజినా శ్రేష్ఠ, ప్రకాష్ సునువార్, మకర్ బహదూర్ తమల్, సుకుల్స తమల్, సుకుల్స తమల్, సుకుల్స తమల్ , అశోక్ కుమార్ త్రిపాఠి , ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, ఉవే విల్నర్, వైభవి బాండేకర్ లున్నారని నేపాల్ అధికారులు వివరించారు. వీరంతా మరణించినట్లు తెలిపారు.