Suspected thief jumps from fourth floor of mumbai building to evade arrest, dies
mictv telugu

4వ అంతస్తు నుంచి దూకిన దొంగ.. విషాదం..

July 9, 2022

Suspected thief jumps from fourth floor of mumbai building to evade arrest, dies

దొంగతనం కోసం ఓ అపార్టుమెంట్లోకి చొరబడిన దొంగ కథ విషాదంగా ముగిసింది. పోలీసులకు భయపడిపోయి, వారి నుంచి తప్పించుకునే మార్గం లేక అతడు నాలుగో అంతస్తు నుంచి ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

రోహిత్ అనే 26 ఏళ్ల యువకుడు వాఖండే ప్రాంతంలోని డి రోడ్ దగ్గర్లో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో చోరీకి వచ్చాడు. డ్రైనేజ్ పైపును పట్టుకుని నాలుగో అంతస్తు చేరుకుని అక్కడే చిక్కుకుపోయాడు. అపార్టుమెంట్ కాపలాదారు అతణ్ని గమనించి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు పైకి చేరుకుని రోహిత్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. రోహిత్ భయపడిపోయి అందుకు సహకరించలేదు. కొన్ని గంటలపాటు చిన్న అరుగుపైనే ఉండిపోయాడు. పోలీసులు బిల్డింగ్ కింద సేఫ్టీ నెట్ కూడా ఏర్పాటు చేశారు. రోహిత్ నెట్ పై కాకుండ పక్క బిల్డింగ్ కాంపౌండులోకి దూకాడు. అంతపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.