నమ్మించి మోసం చేశారు.. నేత్రావతి రైలులో.. - MicTv.in - Telugu News
mictv telugu

నమ్మించి మోసం చేశారు.. నేత్రావతి రైలులో..

August 30, 2019

Suspects Theft Gold In Netravati Express Train 

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అప్రమత్తంగా లేకపోతే అంతే. కేటుగాళ్లు ఉన్నది ఊడ్చుకెళ్లిపోతారు. అందుకే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరిస్తూ ఉంటారు. కానీ చాలా మంది అమాయకంగా ఎదుటివారిని నమ్మి నిలువునా మోసపోతుంటారు. తాజాగా నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు మహిళలను మోసం చేశారు. టీలో మత్తు మందు కలిపి వారు నిద్రలోకి జారుకోగానే ఉన్నదంతా ఎత్తుకెళ్లారు. 

ముంబయి నుంచి కొట్టాయం వెళ్తుండగా ఎల్సీ(60) మరీం( 68) అనే ఇద్దరు మహిళల వద్ద ఒక ఫోన్, బంగారు గొలుసులు, ఉంగరాలు, నగదు కాజేశారు. తోటి ప్రయాణికులుగా వచ్చి టీ తాగమని అందరిని కోరారు. దీంతో వారు ఇచ్చిన టీ తాగిన వెంటనే స్పృహ కోల్పోయారు. ఆదోనికి సమీపంలోని కుప్పగల్‌ రైల్వేస్టేషన్‌లో తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. తొటి ప్రయాణికుల ముసుగులో తమను నిండా ముంచారంటూ బాధితులు మొరపెట్టుకుంటున్నారు.\