మోహన్‌బాబు ఫ్యామిలీకి దుండగుల వార్నింగ్.. నలుగురి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్‌బాబు ఫ్యామిలీకి దుండగుల వార్నింగ్.. నలుగురి అరెస్ట్

August 2, 2020

Suspects Warning To Actor Mohan Babu  .

సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు. జల్‌పల్లిలోని ఆయన ఫాం హౌజ్ వద్దకు శనివారం కారులో వచ్చిన దుండగులు గేటు వద్ద ఆగి మిమ్మల్ని వదలం అంటూ గట్టిగా అరిచారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది రావడం చూసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో కంగుతిన్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నెంబర్ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో సాయంత్రం సమయంలో మోహన్ బాబు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అంతా అక్కడే ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త ఆదమరిచి ఉండటంతో వేగంగా గేటు లోపలికి దూసుకొచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు.  మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పేర్కొన్నారు. ఏదైనా కుట్ర కోణంలో అలా చేశారా..? లేక ఆకతాయిగా వార్నింగ్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కావాలని చేశారా.