‘ఆర్ఆర్ఆర్’ పై సస్పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ పై సస్పెన్షన్

March 7, 2022

bjpp

తెలంగాణలో బీజేపీ తరపును ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్‌లపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడింది. బడ్జెట్ ప్రసంగానికి తరుచూ ఆటంకం కలిగించడంతో పై ముగ్గురిని సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో సమావేశాలు ముగిసేవరకూ వారిని సస్పెండ్ చేశారు. కాగా, గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచి తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఈటల రాజేందర్.. సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే సస్పెండ్ అవడం గమనార్హం.